గల్ఫ్ లో ఇరాన్ విరుచుపడుతోంది. పొరుగు దేశాలపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కు సహాయం చేస్తున్నాయన్న నెపంతో డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడికి దిగుతోంది. లేటెస్టుగా మార్చి 16న తెల్లవారుజామున యూఏఈపై 1800 డ్రోన్లు, మిస్సైళ్ల వర్షం కురిపించింది. దీంతో ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్ధరిల్లింది.
దుబాయ్ ఎయిర్ పోర్టుకు సమీపంపలో చమురు ట్యాంకులే లక్ష్యంగా డ్రోన్స్ ప్రయోగించింది ఇరాన్. దీంతో భారీ పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే తేరుకున్న ఎమర్జెన్సీ టీమ్స్.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీ పేలుడు కారణంగా అన్ని విమానాల రాక పోకలను దుబాయ్ ఎయిర్ పోర్టు రద్దు చేసింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు (DXB) సమీపంలో డ్రోన్ దాడులు జరిగినట్లు దుబాయ్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసింది. సివిల్ డిఫెన్స్ టీమ్స్ విజయవంతంగా మంటలను ఆర్పేశాయఅధికారులు పేర్కొన్నారు. ఈ దాడిలో ప్రాణనష్టం, గాయాలు కాలేదని తెలిపారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( UAE ) లక్ష్యంగా 18 వందల మిస్సైళ్లు, డ్రోన్స్ తో చేసిన దాడిలో దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో డ్రోన్స్ పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇరాన్ యూఏఈపై ఎక్కువ టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుంది. ముఖ్యంగా అమెరికా స్థావరాలు, ప్రజలు, ఆస్తులను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో దుబాయ్ లో పేలుళ్లు సంభవించాయి.
Large fire reported in the vicinity of Dubai International Airport after an Iranian drone attack tonight. pic.twitter.com/XmIvEq2KTu
— OSINTtechnical (@Osinttechnical) March 16, 2026
