డీ-మార్ట్లో షాకింగ్ ఘటన.. బిడ్డకు తల్లి పాలిస్తుంటే చూసిన.. డీమార్ట్ ఉద్యోగి ఎంత మాటన్నాడంటే..

డీ-మార్ట్లో షాకింగ్ ఘటన.. బిడ్డకు తల్లి పాలిస్తుంటే చూసిన.. డీమార్ట్ ఉద్యోగి ఎంత మాటన్నాడంటే..

ముంబై: డీ-మార్ట్లో జరిగిన ఒక షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. డీ-మార్ట్ లో పనిచేస్తున్న ఆ యువకుడి నోటి దురుసుపై సోషల్ మీడియా భగ్గుమంది. కన్న తల్లి బిడ్డకు పాలివ్వడంపై ఆ యువకుడి నీచపు వెటకార థోరణిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైలోని ఒక డీమార్ట్ ఔట్లెట్కు షాపింగ్ నిమిత్తం ఒక వివాహిత బిడ్డతో పాటు వెళ్లింది. ఒకానొక సమయానికి ఆ చంటి బిడ్డకు ఆకలేసి పాల కోసం ఏడ్చింది.

అయితే.. చుట్టూ రద్దీగా ఉండటంతో డీమార్ట్ స్టోర్ లోపలే ఒక మూలకు వెళ్లి ఆ వివాహిత బిడ్డకు పాలిచ్చింది. ఆమెను గమనించిన డీమార్ట్ సిబ్బందిలోని ఒక యువకుడు నీచంగా తోటి ఉద్యోగుల దగ్గరకు వచ్చి కామెంట్స్ చేశాడు. ‘‘నువ్వు కూడా పాలు తాగుతావా ?’’ అని తోటి ఉద్యోగుల దగ్గరకు వచ్చి వివాహితను ఉద్దేశించి నీచంగా కామెంట్ చేశాడు. అతని మాటలను గమనించిన ఒక వ్యక్తి సదరు యువకుడిపై మండిపడ్డాడు. ‘‘నువ్వు కన్న తల్లి దగ్గర పాలు తాగలేదా ?’’ అని ఆ యువకుడిని నిలదీశాడు.

►ALSO READ | పెళ్లి పీటల పైనే ఏంటీ రోత.. పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అని.. ఒకటుంటుందని మర్చిపోయారేమో..!

ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. తల్లి పాలు ఇస్తుంటే చూసి వెకిలి వ్యాఖ్యలు చేసేంత నీచపు మనస్తత్వం ఉన్న అలాంటి వాళ్లను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ వీడియో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే #ShameOnDMart అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

"తల్లి పాలు ఇవ్వడం అనేది ఒక సహజమైన చర్య, ప్రేక్షకులు చూసి ఆనందించే క్రీడ కాదు" అని ఒక నెటిజన్ చెప్పారు. "CCTV పర్యవేక్షణ ఉన్న సూపర్ మార్కెట్‌లోనే ఒక తల్లికి ఇలాంటి వేధింపులు ఎదురైతే.. ఆమె ఎక్కడ సురక్షితంగా ఉంటుంది?" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై డీమార్ట్ స్పందించింది. దర్యాప్తు చేస్తున్నామని.. సదరు యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.