భారతీయ వైవాహిక వ్యవస్థపై పాశ్చాత్య దేశాలు కూడా మక్కువ చూపుతున్న ఈరోజుల్లో పెళ్లిళ్ల సమయంలో కొందరు చేస్తున్న అతి చేష్టలు విమర్శలకు తావిస్తున్నాయి. ఫొటోలు, వీడియోల కోసం పెళ్లి పీటల పైనే ముద్దులు పెట్టుకుంటూ కొన్ని కొత్త జంటలు చేస్తున్న అతి అంతా ఇంతా కాదు.
ఈ జంట అయితే ఒక అడుగు ముందుకేసి ఏకంగా లిప్ లాక్ పేరుతో పెళ్లి వేదిక పైనే అందరూ చూస్తుండగానే ప్రవర్తించిన తీరు చూసి పెళ్లికొచ్చిన అతిథులు విస్తుపోయారు. పెళ్లి మండపంపై కొత్త జంట చూడ ముచ్చటగా ఉండాలి. ఇలా పెళ్లికొచ్చిన అతిథులు, బంధుమిత్రులు చూడలేక ఇబ్బందిపడే పరిస్థితిలో ఉండకూడదని ఈ కొత్త జంట లిప్ లాక్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
Kissing at the mandap in front of Agni Dev?
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026
Absolutely shameful. A Hindu wedding is a sacred ritual, not a Hollywood set. Stop contaminating our sanskriti with this Western copycat nonsense. If you can’t respect the sanctity of Hindu vivah, you don’t deserve it. pic.twitter.com/GVEkoFZPcZ
వధూవరులు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ.. ప్రేమను వ్యక్తం చేస్తున్నామనే పేరుతో ఇలా జుగుప్సాకరంగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో కూడా చర్చిలో వివాహం చేసే పాస్టర్ చెప్పిన తర్వాతే వరుడు, వధువు ముద్దు పెట్టుకుంటారని.. ఈ జంట ఇలా మితిమీరి ప్రవర్తించి హిందూ వివాహ వ్యవస్థపై ఉన్న గౌరవాన్ని సన్నగిల్లేలా చేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు.
►ALSO READ | పదమూడేండ్ల నరక యాతన నుంచి.. హరీష్ రాణాకు విముక్తి.. కన్నీళ్లు పెట్టించే వీడియో !
భారత దేశంలో ప్రస్తుతం వివాహ వ్యవస్థను రక్షించుకోవడమే పెద్ద సమస్యగా మారిందని.. ఇలాంటి తరుణంలో ఈ కొత్త జంట చేసిన నిర్వాకం భారతీయ వైవాహిక వ్యవస్థకు తలవొంపులు తెచ్చి పెట్టేలా ఉందని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
