బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో బీసీ సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన హైదరాబాద్‌లోని లక్డికాపూల్‌లో బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీల అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలుచేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
