కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారీ కె గణేష్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన పాటకు అరుణ్ రాజా కామరాజ్ తమిళ లిరిక్స్ రాయడంతోపాటు ఆంథోని దాసన్, సత్యన్, వీఎమ్ మహలింగంతో కలిసి పాడాడు.
‘వాయా ఏయ్ కరసామీ.. పిలుపు వినిపిస్తే గాలి కూడా ఆగి చూస్తుంది. అడుగు వేస్తే నేల కూడా కంపిస్తుంది. పేరు చెబితేనే పవర్ తెలుస్తుంది..’ అంటూ సాగిన పాటలో ధనుష్ మాసివ్ లుక్ ఇంప్రెస్ చేస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 54వ చిత్రం కాగా, మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. జయరామ్, కేఎస్ రవికుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 30 న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
