మహిళా భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోన్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నా రు. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం టీజర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ 'ఇది చాలా మంచి కథ. మనందరి కథ. మనందరికీ ఎన్నో కథలు, భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ ఈ సినిమా చూసిన తర్వాత మరింతగా అర్ధమ వుతాయి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఇందులో నా పాత్ర వుంటుంది. కుటుంబం అంతా కలిసి హాయిగా చూసే సినిమా ఇది' అని చెప్పారు.
నటి ఆమని మాట్లాడుతూ 'నిజంగానే మా అందరికీ ఇదొక హ్యాపీ జర్నీ. మేమందరం ఫ్రెండ్స్లో కలిసి సినిమా చేశాం. పారిస్లో షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాం. ఇంత పెద్ద లాంగ్ ట్రిప్లో ఇంతమంది ఆర్టిస్టులతో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. ఏడుగురు మహిళలు ఒక ప్రయాణంలో కలిస్తే ఎంత సరదాగా ఉంటుందో, వారి మధ్య ఏర్పడే బంధం, భావోద్వేగాలు, కన్నీ ళ్లు ఎంత హృదయాన్ని తాకుతాయో ఈ సినిమా చూపిస్తుంది అని నటిఝాన్సీ చెప్పారు.
దర్శకుడు అభిరామ్ నాయుడు మాట్లాడుతూ 'మహిళలు బయటకు చెప్పలేని ఎన్నో భావోద్వేగాలను ఇందులో చూపించాం. కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తే ఒక మంచి అనుభూతి కలుగుతుం ది' అని అన్నాడు. నటుడు వంశీధర్ గౌడ్, నటి సునయన, సహ నిర్మాత తరుణ్ రెడ్డి పాల్గొన్నారు.
