హైదరాబాద్- బెంగళూరు హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా

హైదరాబాద్- బెంగళూరు హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెబ్బేరు సమీపంలో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ఒక ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు నియంత్రణ కోల్పోయి అదుపుతప్పి బోల్తా పడింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు బోల్తా పడటంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే చికిత్స నిమిత్తం పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలియగానే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తక్షణమే స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన... దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.