బంగారం, వెండి ధరలకు రెక్కలు? మార్కెట్లో మొదలైన సరికొత్త ట్రెండ్!

బంగారం, వెండి ధరలకు రెక్కలు? మార్కెట్లో మొదలైన సరికొత్త ట్రెండ్!

 మార్కెట్లలో ఇప్పుడు ఒకే చర్చ నడుస్తోంది.. అదే బంగారం దాని రూట్ మార్చింది! అవును, బంగారం ధరలు ఇకపై ఎక్కువ కాలం పాటు భారీగా పెరిగే అవకాశం ఉందంటూ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనించే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకుడు జిమ్ రికార్డ్స్ (Jim Rickards) అయితే  భవిష్యత్తులోనే గోల్డ్ రేట్ ఏకంగా $35,000 డాలర్లకు అంటే దాదాపు రూ. 29 లక్షలకు పైగా చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని సంచలన అంచనా వేశారు.

2000 నాటి సీన్ రిపీట్ కాబోతోందా?
గత చరిత్రను పరిశీలిస్తే.. 2000 సంవత్సరంలో బంగారానికి ఇలాంటి ఒక భారీ బుల్ రన్ (ధరల పెరుగుదల) ప్రారంభమైంది. అప్పట్లో ఒక ఔన్స్ బంగారం ధర కేవలం $300 డాలర్లు(రూ.28,400 ) మాత్రమే ఉండేది. అక్కడ మొదలైన పరుగు ఏ స్థాయికి చేరిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు 2026 నాటి ప్రపంచ ఆర్థిక పరిస్థితులను చూస్తుంటే.. అప్పటికంటే ఘోరమైన సంక్షోభ సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే:

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పుల భారం ఒక పెద్ద బెలూన్‌లా ఉబ్బిపోయింది. అది ఎప్పుడైనా పేలిపోయే ప్రమాదం ఉంది. చుట్టుపక్కల దేశాల ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ, ఈ గందరగోళ పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత బంగారం ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. అందుకే చాలా మంది ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి మళ్లీ బంగారం, వెండిలను కొనుగోలు చేయడం వైపు మొగ్గు చూపుతున్నారు.

►ALSO READ | ఓపెన్ ఏఐ ఇండియా హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుజీత్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బంగారం మాత్రమే నిజమైన డబ్బు.. 
ప్రముఖ బ్యాంకర్ జేపీ మోర్గాన్ ఒకప్పుడు అన్నట్లు "బంగారం మాత్రమే నిజమైన డబ్బు. మిగిలినదంతా కేవలం క్రెడిట్ మాత్రమే."

మనం వాడుతున్న యూఎస్ డాలర్ అయినా, మరే ఇతర కరెన్సీ అయినా అది ప్రభుత్వాలు ఇచ్చే హామీ లేదా ఒక రకమైన 'అప్పు' మాత్రమే. ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడినప్పుడు ఈ కరెన్సీల విలువ పడిపోవచ్చు కానీ, బంగారం విలువ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అందుకే సంక్షోభ సమయాల్లో బంగారం ఎప్పుడూ 'రియల్ మనీ'గా మారుతుంది.

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వేగంగా దూసుకుపోతోంది. దీనివల్ల ప్రపంచంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆర్థికంగా సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం.