- గతంలో ఉబర్ ప్రెసిడెంట్ గా సేవలు
న్యూఢిల్లీ: అమెరికా ఏఐ కంపెనీ ఓపెన్ ఏఐ ఇండియాలో తన వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. క్యాబ్ సర్వీసెస్ కంపెనీ ఉబర్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ ప్రభుజీత్ సింగ్‌ను ఇండియా బిజినెస్‌కు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా నియమించింది. ఓపెన్ ఏఐ సంస్థకు భారత్‌లో ఆయన టాప్ లీడర్‌గా కొనసాగుతారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.
ఇండియాలో ఓపెన్ ఏఐ కస్టమర్లను పెంచడం, ప్రభుత్వ రూల్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ బిజినెస్‌ను విస్తరించడంపై ఫోకస్ పెడతారు. ఓపెన్ ఏఐ ఆసియా పసిఫిక్ ఎండీ కిరణ్ మణికి ఆయన రిపోర్ట్ చేస్తారు. ఓపెన్ ఏఐ సంస్థ నవంబర్ 2025లో న్యూఢిల్లీలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది.
సింగ్ ఉబర్‌లో దాదాపు 11 ఏళ్ల పాటు సేవలు అందించారు. గత ఆరేళ్లుగా ఇండియా, దక్షిణాసియా విభాగానికి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ, కంపెనీ సేవలను 125 నగరాలకు పైగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో చదువుకున్నారు.
