పూజా హెగ్దేకు క్రేజీ ఛాన్స్.. పవన్ కల్యాణ్ ఓజీ 2లో హీరోయిన్‎గా బుట్టబొమ్మ..!

పూజా హెగ్దేకు క్రేజీ ఛాన్స్.. పవన్ కల్యాణ్ ఓజీ 2లో హీరోయిన్‎గా బుట్టబొమ్మ..!

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో టాప్ హీరోలతో జోడీకట్టి స్టార్ హీరోయిన్గా ఫేమ్ పొందింది పూజా హెగ్దే. అయితే కెరీర్ లో సక్సెస్లు తక్కువే అయినా వరుస అవకాశాలు మాత్రం దక్కించుకుంటోంది. తాజాగా టాలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‎తో ఫస్ట్ టైమ్ ఆమె నటించబోతుందట. 

పవన్ హీరోగా సుజీత్ డైరెక్షన్‎లో తెరకెక్కనున్న 'ఓజీ2'లో హీరోయిన్గా పూజా హెగ్దేను ఫైనల్ చేశారట. పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనే ఆమె నటించాల్సి ఉండగా, డేట్స్ ఇష్యూ వల్ల ఆమె ప్లేస్లోకి శ్రీలీలను తీసుకున్నారట. అయితే ఇప్పుడు ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'ఓజీ యూనివర్స్' లో ఆమె ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సుజీత్ ఇప్పటికే నానితో 'బ్లడీ రొమియో' చిత్రాన్ని అనౌన్స్ చేయగా, ముందుగా 'ఓజీ2'ను సెట్సు తీసుకెళ్తాడో, లేదంటే నాని సినిమాను ముందు స్టార్ట్ చేస్తాడో తెలియాల్సి ఉంది