కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ రూరల్ బొమ్మకల్‌లోని శ్రీ రాజరాశ్వర కాలనీలో వివాదస్పద భూమిపై ఆర్డీవో స్టేటస్ కో ఆదేశాలు జారీచేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే గంగుల తన అనుచరులతో కలిసి శనివారం సాయంత్రం ఆ భూమిలోకి వెళ్లారు. తహసీల్దార్‌కు సమాచారం అందడంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
