దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'స్టూడెంట్'. విజేత పరీక్ హీరోయిన్. బాలు తత్వమసి దర్శకత్వంలో బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ భానుగా మేఘాంశ్ శ్రీహరి కనిపిస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరపున పాలిటిక్స్లోకి రావడం కాలేజ్లో ఒక సె న్సేషన్ క్రియేట్ చేస్తాడు.
పాలిటిక్స్కు కొత్తైనా రాజకీయాల్లో ఉండే ప్రమాదాలను, ఎత్తులకు పై ఎత్తులను త్వరగా అర్థం చే సుకుంటాడు భాను. 'పక్కనోడు కత్తితో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చెయ్యి పెడితే తెగిపోద్ది, మనం పాలిటిక్స్లో ఉన్నాం, ఇక్కడ ఎథిక్స్ ఉండవు, ఓన్లీట్రిక్సే ఉంటాయి' అంటూ మేఘాంశ్ చెప్పిన డైలాగ్ టీజర్కు హైలైట్గా నిలుస్తుంది.
స్టూడెంట్ రా జకీయాల్లోకి వస్తే ఈ పొలిటికల్ ఆటను ఎలా మార్చేయగలడు అనేది ఇంపాక్టుల్గా చూపించారు. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ముఖ్య పాత్రలు పోషి స్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, రిలీజ్కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు ప్రేమ్ చంద్ కంచర్ల సంగీతం అందిస్తున్నాడు.
