రజినీకాంత్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'జైలర్ 2'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్గా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ గురించి ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. దసరా పండుగ సెలవులు కలిసొచ్చేలా అక్టోబ ర్ 15న ఈ సినిమాను విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 'జైలర్'లో నటించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ సీక్వెల్లోనూ కనిపించబోతున్నారు.
ఈ సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారని సమాచారం. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక కమల్ హాసన్ బ్యానర్ లో ప్రస్తుతం రజినీకాంత్ 'ధర్మన్' చిత్రంలో నటి స్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారం భమైన ఈ సినిమా రజినీ 'ది డెడ్లీ డాక్టర్'గా కనిపించనున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శక త్వం వహిస్తుండగా, సిమ్రాన్, రాశీఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
