కొనంకి కార్తీక్ లీడ్ రోల్లో శ్రద్ధ ఖత్రి దర్శకత్వంలో కె. వి. నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'సోల్జర్ 24x7 ఆన్ డ్యూటీ'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను ODE చేశారు. ఇందులో కార్తీక్ పవర్ఫుల్ సైనికుడి పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. యుద్ధ వాతావరణం, పోరాట ఛాయలు, గర్వంగా రెపరెపలాడుతున్న భారత త్రివర్ణ పతాకం మధ్య తన లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధతకు ప్రతీకగా ఈ చిత్రం రూపొందు తోందని మేకర్స్ తెలియజేశారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వహిస్తూ దేశ భద్రత కోసం అహర్నిశలు కృషిచేసే భారత సైనికులకు ఈ చిత్రం ఘన నివాళిగా నిలవనుందని అన్నారు. ప్రియాంక వర్మ ప్రధాన హీరోయిన్గా నటిస్తుంది.
