మంచిర్యాల జిల్లాలో భూవివాదంలో తమ్ముడిని చంపిన అన్న

మంచిర్యాల జిల్లాలో భూవివాదంలో తమ్ముడిని చంపిన అన్న

బెల్లంపల్లి, వెలుగు : భూ వివాదంలో ఓ వ్యక్తి తన తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... చంద్రవెల్లి గ్రామానికి చెందిన సందనవేణి చందు, రాజేశ్ (28) అన్నదమ్ములు. చందు వ్యవసాయం చేసుకొని జీవిస్తుండగా, రాజేశ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి నచ్చజెప్పినా సద్దుమణగలేదు. ఆదివారం కూడా మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన చందు గొడ్డలితో రాజేశ్ పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రాజేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న బెల్లంపల్లి ఏసీపీ కిరణ్​కుమార్, రూరల్​సీఐ హనోక్, ఎస్సై రామకృష్ణ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తాళ్లగురిజాల పోలీసులు తెలిపారు.