మూలకణాలతోచికిత్సపై అంతర్జాతీయ సదస్సు.. రీజెనరేటివ్ మెడిసిన్ ద్వారా చికిత్స

మూలకణాలతోచికిత్సపై అంతర్జాతీయ సదస్సు.. రీజెనరేటివ్ మెడిసిన్ ద్వారా చికిత్స

జూబ్లీహిల్స్, వెలుగు: మూలకణాలతో రోగులకు చికిత్స అందించే విధానాలపై హైదరాబాద్‌‌లో ఆదివారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్‌‌లో ఇండియన్ స్టెమ్ సెల్ స్టడీ గ్రూప్, యశోద హాస్పిటల్స్​ సంయుక్తంగా 8వ అంతర్జాతీయ స్టెమ్ సెల్స్ సదస్సును ఏర్పాటు చేశాయి. 

భారత్‌‌తో పాటు వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పరిశోధకులు పాల్గొన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి.ఎల్. శ్రీనివాస్ మాట్లాడుతూ రీజెనరేటివ్ మెడిసిన్ ద్వారా సర్జరీ లేకుండానే అనేక రోగాలకు చికిత్స అందించవచ్చన్నారు. 

కార్యక్రమంలో యశోదా హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ ఎ.లింగయ్య, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ సుబ్రమణ్యం, కో-ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సాకేత్ తదితరులు
 పాల్గొన్నారు.