తొగుట (మీరుదొడ్డి), వెలుగు: కాలువలు నిర్మించి సాగునీరు అందించాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ప్యాకేజ్-13 కెనాల్ నుంచి మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలలో పెండింగ్‌లో ఉన్న డీ12 కాలువ, అల్వాల్ గ్రామానికి చెందిన హంసారి చెరువుకు నీటి పంపిణీ చేసే పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పనులు చేయకపోవడంతో రైతులే స్వయంగా కాలువలకు రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. రైతులకు తాను అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు సుకురి లింగం, నరేశ్, బాబు, రైతులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
వనపర్తి, వెలుగు : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం గోపాల్పేట మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న కొత్త ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు కొత్త బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పొలికేపాడు గ్రామ సర్పంచ్ బంగారయ్య, ఉపసర్పంచ్ జంపన్న, వార్డు మెంబర్లు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరారు.
