- వారానికి కార్లకు15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే పంపిణీ
కొలంబో: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇంధన సంక్షోభం తలెత్తకుండా ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ‘క్యూఆర్ కోడ్’ ఆధారిత ఇంధన రేషనింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇకపై కార్లకు వారానికి గరిష్టంగా 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్ల చొప్పున మాత్రమే ఇంధనాన్ని పంపిణీ చేస్తారు.
దేశంలో ప్రస్తుతం 4 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ, ప్రజలు భయాందోళనతో ముందస్తుగా భారీగా ఇంధనం నిల్వ చేసే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పెట్రోల్ ధరలను పెంచిన సర్కారు తాజాగా రేషనింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
