కొత్త టెక్నాలజీతో బైకర్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ స్కోరు

కొత్త టెక్నాలజీతో బైకర్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ స్కోరు

‘బైకర్’ చిత్రంలోని మ్యూజిక్ చాలా కొత్తగా ఉంటుందని, రేసింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ అన్నాడు. శర్వానంద్ హీరోగా  అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జిబ్రాన్ మాట్లాడుతూ ‘శర్వానంద్  గారి  ‘రన్ రాజా రన్’  సినిమాతోనే  నేను ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిచయం అయ్యాను.  మళ్లీ ఇన్నాళ్లకు  ఈ సినిమాతో  మంచి కం బ్యాక్ వస్తుందని నమ్ముతున్నా. సినిమాలో ఎనిమిది పాటలు ఉన్నాయి. అందులో ఒకటి పూర్తి పాటగా ఉంటుంది.  

మిగతావి మాంటేజ్ సాంగ్స్.  రేసింగ్ సన్నివేశాల్లో బైక్స్ నుంచి వచ్చే సౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సౌండ్స్ వల్ల మ్యూజిక్ వినిపించకుండా పోకూడదు. అందుకే కొత్త టెక్నాలజీ ఉపయోగించి బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండేలా చేశాం. అలాగే  ఈ మూవీ మేకింగ్ హాలీవుడ్ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. 

కేవలం రేసింగ్, యాక్షన్ మాత్రమే కాదు, చాలా స్ట్రాంగ్  ఫ్యామిలీ ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది.  క్రీడాకారుడైనా, రేసర్ అయినా అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ ఇందులో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను ఇష్టపడతారు’ అని  చెప్పాడు.