కేడి ది డెవిల్ మూవీ నుంచి సంజయ్ దత్ సాంగ్ రిలీజ్

కేడి ది డెవిల్ మూవీ నుంచి సంజయ్ దత్ సాంగ్ రిలీజ్

‘జరిపే జరిపే నాతో పండగ జరిపేయ్..’ అంటూ  సంజయ్ దత్, నోరా ఫతేహి  కాంబోలో వచ్చిన   మాస్ బీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉర్రూతలూగిస్తోంది.  కన్నడ స్టార్  ధృవ సర్జా హీరోగా ప్రేమ్స్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ‘కేడీ : ది డెవిల్’ చిత్రంలోని పాట ఇది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 

ఈ నేపథ్యంలో  మ్యూజికల్ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా  సినిమాలోని సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘హే నా సిలుకు సిలుకు చీర జారే.. హే జారే జారే చీర తోడు కోరే.. నన్ను చేరే వాడెవ్వడే.. సరసంలో సరిపోయే జోడెవ్వడే..’ అంటూ  అర్జున్ జన్యా కంపోజ్ చేసిన మాసిస్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. 

మంగ్లీ పాడిన తీరు ఆకట్టుకుంది. ‘అంగట్లో అన్నీ ఉన్నా.. ఇంట్లోనే ఎన్నో ఉన్నా.. మీసాల కుర్రాళ్లారా నేనే మీకు నచ్చేశానే.. పిలవంగానే చేరిందంటే విలువేముంటుందే.. అడగంగానే దొరికందంటే అలుసైపోతుందే.. దొంగలాగ  దూకేసి  తోటలోకి వచ్చేసేయ్.. కోసుకున్న మామిడికాయ నేనే నేనేలే..’ అంటూ సాగిన పాటకు  రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీలో  నోరా ఫతేహీ స్టెప్స్  గ్లామర్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి.  శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్, రమేశ్ అరవింద్, రీష్మా నానయ్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ  చిత్రం ఏప్రిల్ 30 పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విడుదల కానుంది.