బంగ్లాదే వన్డే సిరీస్‌‌‌‌.. మూడో మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి

బంగ్లాదే వన్డే సిరీస్‌‌‌‌.. మూడో మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి

మిర్పూర్‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌లో తంజిద్‌‌‌‌ హసన్‌‌‌‌ (107) సెంచరీకి తోడు బౌలింగ్‌‌‌‌లో తస్కిన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (4/49), ముస్తాఫిజుర్‌‌‌‌ రెహమాన్‌‌‌‌ (3/54) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌‌‌‌ 11 రన్స్‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌పై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ 2–1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బంగ్లా50 ఓవర్లలో 290/5 స్కోరు చేసింది. 

హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత ఛేజింగ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ 50 ఓవర్లలో 279 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. సల్మాన్‌‌‌‌ ఆగా (106) సెంచరీతో పోరాడాడు. మసూద్‌‌‌‌ (38), షాహీన్‌‌‌‌ ఆఫ్రిది (37), అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ (34), గాజి ఘోరి (29) ఓ మోస్తరుగా ఆడారు. నహిద్‌‌‌‌ రాణా 2 వికెట్లు పడగొట్టాడు. తంజిద్‌‌‌‌ హసన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’, ‘సిరీస్‌‌‌‌’ అవార్డులు లభించాయి.