చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే స్టార్లు అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. కానీ, ఏకంగా ‘రెబల్ స్టార్’ ప్రభాస్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యే అవకాశం దక్కించుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోలతో లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఇమాన్వీ (Iman Esmail), ఇప్పుడు ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న 'ఫౌజీ' (Fauji) చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
సోషల్ మీడియా డ్యాన్సర్ నుంచి ప్రభాస్ హీరోయిన్ వరకు..
ఢిల్లీకి చెందిన ఇమాన్వీ ప్రాథమికంగా డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. క్లాసికల్ నుంచి వెస్ట్రన్ వరకు అన్ని డ్యాన్స్ ఫార్మాట్స్‌లో ఆమె చూపే ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యేవారు. అదే క్రేజ్ ఆమెను హను రాఘవపూడి కళ్ళలో పడేలా చేసింది. 'సీతారామం' వంటి క్లాసిక్ హిట్ తర్వాత హను తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియడ్ డ్రామాలో ఇమాన్వీని హీరోయిన్‌గా ఎంపిక చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
Also Read : విలన్ గా మారి రూ. 2000 కోట్లు కొల్లగొట్టిన హీరో
ఎరుపు రంగు చీరలో ఇమాన్వీ ‘కవ్వింత’
లేటెస్ట్ గా ఇమాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు చీరలో, తక్కువ మేకప్, క్యూట్ లుక్స్‌తో ఆమె దేవకన్యలా మెరిసిపోతోంది. తన కొంటె చూపులు, చిలిపి నవ్వులతో కేవలం ఫోటోలతోనే ప్రభాస్ అభిమానులను కట్టిపడేస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు "డార్లింగ్‌కు పర్ఫెక్ట్ జోడి", "హను రాఘవపూడి మళ్ళీ ఒక అద్భుతమైన హీరోయిన్‌ను పట్టుకొచ్చాడు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
'ఫౌజీ' కథా విశేషాలు..
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్న ఈ చిత్రం 1940ల నాటి నేపథ్యంలో సాగుతుంది. యుద్ధం, ప్రేమ, న్యాయం అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ కాలం నాటి సైనికుడిగా కనిపిస్తారని సమాచారం. యుద్ధం ఎంత భీకరంగా ఉన్నా, హను రాఘవపూడి మార్క్ పోయెటిక్ లవ్ స్టోరీ ఇందులో హైలైట్‌గా ఉండబోతోంది. ఇమాన్వీ పాత్ర కూడా చాలా హుందాగా, సాంప్రదాయబద్ధంగా ఉంటుందని టాక్.
గ్లోబల్ స్టార్ సరసన..
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో ఇమాన్వీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తొలి సినిమాతోనే ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ అమ్మడు, భవిష్యత్తులో స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
