ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, డీఎన్బీ, ఎంఎస్, ఎండీ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
ఖాళీలు: 15.
విభాగాల వారీగా ఖాళీలు: సూపర్ స్పెషలిస్ట్ 2, స్పెషలిస్ట్ 6, సీనియర్ రెసిడెంట్ 7.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డీఎన్ బీ/ డిప్లొమా/ డీఎం/ ఎంసీహెచ్/ డాక్టర్ ఎన్బీ పూర్తిచేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.250. ఎస్సీ, ఎస్టీలకు రూ.50.
లాస్ట్ డేట్: మార్చి 19.
సెలెక్షన్ ప్రాసెస్: క్వాలిఫికేషన్ వెరిఫికేషన్, ఎక్స్ పీరియన్స్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు esic.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
