హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గంలో సుమారు 1.70 లక్షల ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్‌పల్లి, మూసాపేట జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జోనల్ కమిషనర్‌తో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అధికారుల పనితీరు, ఓటర్ల జాబితా అంశాలపై ఎమ్మెల్యే పలు ప్రశ్నలు లేవనెత్తారు.సమావేశం జరుగుతున్న సమయంలో జోనల్ కమిషనర్ మధ్యలోనే వెళ్లిపోవడంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారి సమావేశం మధ్యలో వెళ్లిపోవడం సరికాదన్నారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) సక్రమంగా పనిచేయడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ఓటర్ల జాబితా విషయంలో కూడా అధికారులు తగిన విధంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు.కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారింది. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు అని మాధవరం కృష్ణారావు ఆరోపించారు.
►ALSO READ | మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి మృతి కేసులో ట్విస్ట్.. వైజాగ్ వెళ్లి లైజాల్ తాగిన నిందితుడు శ్రీనివాస్
ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలన జరపాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుత కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వ్యవహారశైలిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఓటర్ల జాబితా, బీఎల్‌ఓల పనితీరుపై ఉన్న అభ్యంతరాలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
