రాణించిన స్పిన్నర్లు... 93 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ..

రాణించిన స్పిన్నర్లు... 93 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక జరుగుతున్న మ్యాచ్ లో నమీబియాతో తలపడుతోంది ఇండియా. ఈ మ్యాచ్ లో టాస్  ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా నమీబియా ముందు 210 టార్గెట్ ఉంచింది. భారీ టార్గెట్ లక్ష్యంగా బరిలో దిగిన నమీబియా ఇండియా బౌలింగ్ ధాటికి నిలబడలేకపోయింది. 18.2 ఓవర్లలో 116 పరుగులు చేసిన నమీబియా ఆలౌట్ అయ్యింది. దీంతో 80 పరుగుల తేడాతో ఇండియా ఘనవిజయం సాధించింది.

టీం ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు ఓవర్ల వేసి 7 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించగా..అక్సర్ పటేల్ 2, హార్దిక్ పాండ్య 2 వికెట్లు, హర్షదీప్ సింగ్, బుమ్రా, శివమ్ దూబే చెరో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ గెలుపొంది టీ20 వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది టీం ఇండియా.

టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా టాప్ ఆర్డర్ నిరాశపరిచింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీలు మినహా బ్యాటర్లు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. 20 ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయిన టీం ఇండియా 209 రన్స్ చేసి... ఆలౌట్ అవ్వకుండా పరువు కాపాడుకుంది. ఈ క్రమంలో పసికూన నమీబియా ముందు 210 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది టీం ఇండియా.

ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా బరిలో దిగిన ఇషాన్ 24 బంతుల్లో 61 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయారు. 5వ వికెట్ గా బరిలో దిగిన హార్దిక్ పాండ్య 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 52 రన్స్ సాధించాడు. హార్దిక్ హాఫ్ సెంచరీ చేయడంతో టీం ఇండియా స్కోర్ 200 దాటింది.ఎరాస్మస్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు హార్దిక్ పాండ్య. మొత్తానికి స్పిన్నర్లు రాణించడంతో ఈ మ్యాచ్ లో 93 పరుగుల తేడాతో గెలుపొందింది టీం ఇండియా.