అనిరుధ్‌తో SRH ఓనర్ కావ్య మారన్ సీక్రెట్ పెళ్లి? నెట్టింట జోరుగా ప్రచారం

అనిరుధ్‌తో SRH ఓనర్ కావ్య మారన్ సీక్రెట్ పెళ్లి? నెట్టింట జోరుగా ప్రచారం

దేశమంతా ఒకవైపు ఐపీఎల్ (IPL 2026) మ్యాచ్‌లని ఉత్కంఠగా వీ క్షిస్తుంటే, మరోవైపు సినిమా, క్రికెట్ సర్కిల్స్‌ను షేక్ చేసే ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సంగీత ప్రపంచంలో తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్ (Kavya Maran) త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారనే న్యూస్ టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. వీరిద్దరూ ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరందుకుంది. 

లాస్ వెగాస్ డేటింగ్ ఫొటోస్: 
అనిరుధ్, కావ్య మారన్ మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు ఈరోజు వచ్చినవి కాదు.. గత ఏడాది నుంచే వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ విదేశాల్లోని లాస్ వెగాస్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, అక్కడ డిన్నర్ డేట్‌లలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తోడు కావ్య మారన్ తండ్రి, మీడియా మొఘల్ కళానిధి మారన్‌కు చెందిన సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌లో అనిరుధ్ వరుసగా పెద్ద సినిమాలకు (జైలర్) మ్యూజిక్ అందిస్తుండటం.. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.

రంగంలోకి రజనీకాంత్?: 
సోషల్ మీడియాలో వినిపిస్తున్న అత్యంత క్రేజీ లీక్ ఏంటంటే.. అనిరుధ్ రవిచందర్‌కు వరుసకు మావయ్య అయిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఈ పెళ్లి సంబంధం కోసం స్వయంగా రంగంలోకి దిగారని టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ స్వయంగా కళానిధి మారన్‌తో మాట్లాడి ఈ జంటను ఆశీర్వదించాల్సిందిగా కోరారని, రెండు వైపులా ఉన్న పెద్దలు పెళ్లికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తమిళ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయాలపై సన్ నెట్‌వర్క్ కానీ, అనిరుధ్ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

►ALSO READ | ధోనీ లేకుండా చెన్నై ప్లేఆఫ్స్ చేరేనా?.. సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ ఏమ్మన్నారంటే!

అనిరుధ్ రియాక్షన్?:
పెళ్లి వార్తలు పీక్స్‌కు చేరిన తరుణంలో.. ఇటీవలే ఒక పబ్లిక్ ఈవెంట్‌లో అనిరుధ్‌కు మీడియా నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఒక రిపోర్టర్ పేరు ఎత్తకుండా.. “సార్, త్వరగా పెళ్లి పిలుపు ఇవ్వండి” అని అనగా, అనిరుధ్ నవ్వుతూ తమిళంలో “ఇదు వేరా?” (మళ్లీ ఇదేనా?) అంటూ సింపుల్‌గా దాటవేశారు. గతంలో కూడా ఆయన ఎక్స్ వేదికగా “మ్యారేజ్ ఆ? లోల్.. కాస్త రూమర్స్ ఆపండి బాసూ” అంటూ కొట్టిపారేశారు. అటు కావ్య మారన్ కానీ, మారన్ ఫ్యామిలీ కానీ ఈ పుకార్లపై ఏరోజు రియాక్ట్ కాలేదు. 

బిజీ బిజీగా ఆ ఇద్దరు:
ఈ ఇద్దరు సెలబ్రిటీలు ప్రస్తుతం తమ తమ కెరీర్‌లపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అనిరుధ్‌: ప్రసెంట్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్‌గా.. జైలర్ 2, జననాయగన్, షారూఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా బిజీ అయిపోయాడు. 

కావ్య మారన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పనులతో పాటు ఇటీవల సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఈస్టర్న్ కేప్ టీమ్ వరుసగా టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించి బిజినెస్ ఉమెన్‌గా ఫుల్ బిజీ అయింది.