ధోనీ లేకుండా చెన్నై ప్లేఆఫ్స్ చేరేనా?.. సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ ఏమ్మన్నారంటే!

ధోనీ లేకుండా చెన్నై ప్లేఆఫ్స్ చేరేనా?.. సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ ఏమ్మన్నారంటే!

ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్ రేసు క్లైమాక్స్‌కు చేరింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్ గుండె పగిలే ఒక వార్త బయటకు వచ్చింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ (GT) తో అహ్మదాబాద్ వేదికగా జరగనున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌కు తలా మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అందుబాటులో ఉండటం లేదని తెలుస్తుంది. ఈ విషయాన్ని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్వయంగా వెల్లడించాడు. 

హస్సీ ఏం చెప్పాడంటే: 
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మైక్ హస్సీ మాట్లాడుతూ.. ధోనీ ప్రస్తుతం జట్టుతో లేడనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.. అతని చేతిబొటనవేలికి గాయం (Thumb Injury) అయింది. దీంతో చికిత్స తీసుకుంటున్నాడు.. కానీ గుజరాత్‌తో మ్యాచ్ సమయానికి అతను పూర్తిగా ఫిట్ అయ్యే అవకాశం మాత్రం లేదు.. ఒకవేళ మా జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే మాత్రం.. ధోనీ ఖచ్చితంగా జట్టుతో తిరిగి కలుస్తాడని హస్సీ క్లారిటీ ఇచ్చాడు.

సీఎస్కేకు 'చావో రేవో' పోరు: 
గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) చేతిలో ఘోర పరాజయం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారింది. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 181 పరుగుల టార్గెట్‌ను, సన్‌రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడి మ్యాచ్ ని గెలిపించాడు. ఈ ఓటమిపై హస్సీ స్పందిస్తూ.. హోమ్ గ్రౌండ్‌లో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించలేకపోవడం డ్రెస్సింగ్ రూమ్‌ను కాస్త కుంగదీసింది, ఆ తప్పుల నుంచి నేర్చుకుని త్వరగా ముందుకు సాగాల్సి ఉంటుందన్నాడు. 

►ALSO READ | గుజరాత్తో Do or Die ఫైట్.. ఈ మ్యాచ్ ఓడితే చెన్నై ఇంటికే

ప్లేఆఫ్స్ ఛాన్స్: 
గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్ సీఎస్కేకు 'డూ ఆర్ డై' లాంటిది.. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సేన గెలిస్తే 14 పాయింట్లకు చేరుకుంటుంది. కేవలం గెలవడమే కాదు.. లీగ్ దశలో మిగిలి ఉన్న ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలు కూడా చెన్నైకి అనుకూలంగా రావాలని, అప్పుడే సీఎస్కే ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. అహ్మదాబాద్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే మా టార్గెట్ అని హస్సీ ధీమా వ్యక్తం చేశాడు.

ఇరు జట్ల స్క్వాడ్‌:
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), నిషాంత్ సింధూ, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడా, సాయి కిశోర్, మొహమ్మద్ సిరాజ్.

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేలా హోసెన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సార్ జాన్సన్, ముకేశ్ చౌదరి.