గుజరాత్తో Do or Die ఫైట్.. ఈ మ్యాచ్ ఓడితే చెన్నై ఇంటికే

గుజరాత్తో Do or Die ఫైట్.. ఈ మ్యాచ్ ఓడితే చెన్నై ఇంటికే

GT vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్ vs- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగబోతుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక గుజరాత్ వర్సెస్- చెన్నై ఇరు జట్లకి ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. మరోవైపు క్వాలిఫైయర్ -1లో ఆడే ఛాన్స్ దక్కించుకోవాలంటే గుజరాత్ టైటాన్స్ కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలి.. దాంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా కొనసాగే ఛాన్స్ ఉంది. 

ప్లే ఆఫ్స్ కోసం చెన్నై ప్రయత్నం: 
ఈ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన కమ్ బ్యాక్‌తో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. కావునా ఈ మ్యాచులో గుజరాత్ పై చెన్నై గనుక గెలవకపోతే, ఇంటికి వెళ్లిపోవాల్సిందే. అయితే, పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో ఉండగా, ఐదో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఏడో స్థానానికి దిగజారిపోయింది. 

►ALSO READ | రోహిత్ శర్మ వన్డే కెరీర్ ప్రమాదంలో ఉందా?.. వరల్డ్ కప్ ఆడటం డౌటేనా.?

హెడ్ టు హెడ్ రికార్డులు: 
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ -వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇరు జట్లు పోటాపోటీగా ఆడగా గుజరాత్ 5, చెన్నై సూపర్ కింగ్స్ 4 మ్యాచ్‌లలో గెలిచాయి. ఈ సీజన్‌లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా గుజరాతే విక్టరీ సాధించింది. చెన్నై హోం గ్రౌండ్ చెపాక్‌లో ఆ జట్టును ఓడించి గుజరాత్ అధిపత్యం ప్రదర్శించింది. దాంతో గుజరాత్ హోం గ్రౌండ్‌లో ఆ జట్టును ఓడించాలని సీఎస్కే చూస్తుంది. 

ఇరు జట్ల అంచనా: 
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), నిషాంత్ సింధూ, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడా, సాయి కిశోర్, మొహమ్మద్ సిరాజ్.

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేలా హోసెన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సార్ జాన్సన్, ముకేశ్ చౌదరి.