మ‌లైకా బ‌ర్త్డే ట్రీట్తో.. మంత్రముగ్దుడైన క‌పూర్ బోయ్

మ‌లైకా బ‌ర్త్డే ట్రీట్తో.. మంత్రముగ్దుడైన క‌పూర్ బోయ్

బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్(Arjun Kapoor), హీరోయిన్ మలైకా అరోరా(Malaika Arora) లవర్స్ అని అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయిపొయింది. దాదాపు ఐదేళ్లుగా డేటింగ్లో ఉన్నఈ బాలీవుడ్ జంట బ్రేకప్ అనే న్యూస్ రాగానే చాలా మంది హార్ట్ అయినట్లు కనిపించింది.  ఆ తర్వాత మళ్లీ కలిసొచ్చిన ఫోటో వరాల కావడంతో బ్రేకప్ రూమర్స్ కు ఎండ్ కార్డ్ పడింది. అలాగే లేటెస్ట్ గా అర్జున్ తన ప్రియురాలు మలైకా ఎంత అన్యోన్యంగా ఉన్నారో మ‌రో పిక్ తో చూపించేశారు. 

నిన్న సోమవారం (అక్టోబర్23) మలైకా అరోరా బ‌ర్త్ డే స్పెషల్ గా ఇద్ద‌రు స‌న్నిహితంగా రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. న‌డి రాతిరిలో ఒకరికొకరు మైమరిచేలా..పార్టీలో చిల్ అవుతున్న‌ ఫొటోస్ చూస్తుంటే..ఇక వీరి మధ్య గ్యాప్ ఎప్పుడు రాదనే విషయాన్ని రూమర్స్కు హింట్ ఇచ్చేలా ఉంది. మ‌లైకా కౌగిలికి క‌పూర్ బోయ్ దాసహంతో మంత్ర ముగ్దుడ‌వుతూ ఖుషీలో మునిగిపోయాడు. మలైకా ధరించిన వైట్ కాంబినేష‌న్ లెహంగాతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తుంది. అలాగే మలైకా చేతి వేలికి గ్రీన్ రింగ్స్ స్పెషల్ అట్ట్రాక్టీవ్ తో ఉండగా..అర్జున్ క‌పూర్ బ్లాక్ అండ్ బ్లాక్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు.  

Also Read :- అపార్ట్ మెంట్ మంటల్లో చనిపోయిన

అర్జున్ కపూర్ విషెష్ చెబుతూ.. 'హ్యాపీ బర్త్‌డే బేబీ..మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం. నీలో చిరునవ్వును, ఆనందాన్ని ప్రతి క్షణం కలిగిస్తాను. కష్టం ఎదురైతే నేనప్పటికీ నీకు వెన్నుదన్నుగా ఉంటానని అర్జున్ చేసిన ఇన్స్టా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉందనేది మరోసారి అందరికీ అర్ధమయ్యింది.  అర్జున్ కపూర్ వయస్సు 38 సంవత్సరాలు..మలైకా అరోరాకు ఇది 50 వ పుట్టిన రోజు. 

మలైకా గతంలో నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి 20 ఏళ్ల కుమారుడు అర్హాన్ ఖాన్‌ అనే అబ్బాయి ఉన్నాడు. కాగా 19  ఏళ్ళ వివాహ బంధం తర్వాత అర్బాజ్ ఖాన్‌ తో 2017లో విడాకులు తీసుకున్నారు.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)