అపార్ట్ మెంట్ మంటల్లో చనిపోయిన ఐపీఎల్ మాజీ క్రికెటర్ సోదరి ఫ్యామిలీ

అపార్ట్ మెంట్ మంటల్లో చనిపోయిన ఐపీఎల్ మాజీ క్రికెటర్ సోదరి ఫ్యామిలీ

ముంబైలోని కాన్డివ్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం(అక్టోబర్ 23) తొమ్మిది అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో చాలామంది ప్రాణాలను కోల్పోయారు. వీరిలో మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెటర్ పాల్ వాల్తాటి సోదరి.. గ్లోరీ వాల్తాటి (45), ఆమె కుమారుడు జాషువా జెమ్స్ రాబర్ట్ (8)గా ఉన్నట్లు గుర్తించారు.  

అగ్నిమాపక దళం తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12.27 గంటలకు మంటలు చెలరేగాయి. సాయంత్రం 4.34 గంటలకు ఆ భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగినప్పుడు గ్లోరీ కిందకి వచ్చే ప్రయత్నంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్లోరీ మరియు జాషువా ఇద్దరూ మెట్లు దిగే ప్రయత్నంలో మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అయితే మంటలు, వేడిమి కారణంగా అంతకు మించి వెళ్లలేకపోయారు. ఆ తర్వాత టెర్రస్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించినా అక్కడికి చేరుకోలేకపోయారు. 

ALSO READ: RSA vs BAN: దక్షిణాఫ్రికా బ్యాటింగ్.. ఇరు జట్లలో కీలక మార్పులు

వాల్తాటి సోదరిఫ్యామిలీ స్కాట్ లాండ్ లో నివసిస్తున్నారు. తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో చూడడానికి ముంబైకి వచ్చారు. ఆమెతో పాటు ఆమె భర్త, కొడుకు ఉన్నారు. అయితే ఈ మంటల్లో మాత్రం గ్లోరీ భర్త లేరు. కాగా.. 2009లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వాల్తాటీ 2013 వరకు మొత్తం 23 మ్యాచ్‌లు ఆడి 505 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్‌లో 2011 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున వాల్తాటి చెన్నై సూపర్ కింగ్స్ పై 120 పరుగులతో వీరోచిత సెంచరీ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.