బ్రిస్బేన్: ఆస్ట్రేలియా గడ్డపై పదేండ్ల తర్వాత టీ20 సిరీస్ గెలిచిన జోష్‌లో ఉన్న ఇండియా విమెన్స్ టీమ్ వన్డే సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశపరిచిన ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ వన్‌సైడెడ్ మ్యాచ్‌లో తొలుత ఇండియా 48.3 ఓవర్లలో 214 రన్స్‌కే ఆలౌటైంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (53) ఫిఫ్టీలతో సత్తా చాటగా.. కశ్వీ గౌతమ్ (43), రిచా ఘోశ్ (23) ఫర్వాలేదనిపించారు. ప్రతీక రావల్ (0), షెఫాలీ వర్మ (4), జెమీమా రోడ్రిగ్స్ (8), దీప్తి శర్మ (2) ఫెయిలయ్యారు.
ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్ మూడు, మేగన్ షట్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆసీస్ 38.2 ఓవర్లలోనే 217/4 స్కోరు చేసి గెలిచింది. బెత్ మూనీ (76), కెప్టెన్ అలీసా హీలీ (50) ఫిఫ్టీలతో విజృంభించగా.. సదర్లాండ్ (48 నాటౌట్), లిచ్‌ఫీల్డ్ (32) కూడా రాణించారు. ఇండియా బౌలర్లలో శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది. కాగా, బ్యాటింగ్ చేస్తుండగా ఎడమ మోకాలి గాయానికి గురైన కెప్టెన్ హర్మన్.. ఫీల్డింగ్‌కు దూరమైంది. మంధాన స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించింది.మూనీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే హోబర్ట్‌లో శుక్రవారం జరుగుతుంది.
