జోరుగా ఇండియా ప్రాక్టీస్..నెట్స్‌‌‌‌లో చెమటోడ్చిన అక్షర్ పటేల్‌‌‌‌

జోరుగా ఇండియా ప్రాక్టీస్..నెట్స్‌‌‌‌లో చెమటోడ్చిన అక్షర్ పటేల్‌‌‌‌
  • జింబాబ్వేతో మ్యాచ్‌‌‌‌కు రింకూ దూరం!

చెన్నై: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా గురువారం జింబాబ్వేతో జరగనున్న సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–8 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముమ్మరం చేసింది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు 30 నిమిషాలు చెమటోడ్చాడు. అయితే అతను ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటాడా? లేదా? అన్న దానిపై సస్పెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోంది. గత పోరులో అక్షర్ స్థానంలో ఆడిన సుందర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 

మరోవైపు  ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరం అయ్యే చాన్స్‌‌ ఉంది. రింకూ తండ్రి ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోయిడాలోని ఓ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాడు. రింకూ అందుబాటులో లేకుంటే సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తప్పించకుండానే అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌ను తీసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉంది. అయితే కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ ఓ అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఎరుపు, నలుపు నల్ల మట్టితో కూడిన చెపాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టులో ఉండాలనే వాదన కూడా వినిపిస్తోంది.