మారుతున్న అమెరికా పరిణామాలతో బంగారం, వెండి రేట్లు అనూహ్య మార్పులకు లోనవుతున్నాయి. ఒకరోజు తగ్గుతూ మరోరోజు పెరుగుతూ కొనుగోలుదారులకు అస్సలు అర్థం కాకుండా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం అందరి చూపు ఇరాన్ అమెరికా మధ్య రగులుతున్న యుద్ధ భయాలపైనే ఉండటంతో గోల్డ్ పెరుగుతోంది. నేడు షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తాజా రేట్లను పరిశీలించటం మంచిది.
ఫిబ్రవరి 24న బంగారం రేట్లు పెరిగి వినియోగదారులకు షాకిచ్చాయి. దీంతో ఫిబ్రవరి 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.43 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 178గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 830గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీ తిరిగి పుంజుకుందని నిపుణులు అంటున్నారు. అయితే మంగళవారం ఫిబ్రవరి 24, 2025న వెండి రేటు కేజీకి రూ.10వేలు తగ్గింది తెలుగు రాష్ట్రాల్లో. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 90వేలకు చేరుకుంది. అంటే గ్రాము ధర రూ.290 వద్ద ఉంది.
