హ్యారీ హండ్రెడ్.. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..పాక్ సెమీస్ ఆశలు గల్లంతు!

హ్యారీ హండ్రెడ్.. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..పాక్ సెమీస్ ఆశలు గల్లంతు!
  • 50 బాల్స్‌‌‌‌‌‌‌‌లో సెంచరీతో  కెప్టెన్‌‌‌‌‌‌‌‌  బ్రూక్ విధ్వంసం
  • 2 వికెట్లతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై ఇంగ్లిష్ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీ
  • టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో పాక్ సెమీస్ ఆశలు గల్లంతు!

 పల్లెకెలె: ఇంగ్లండ్ టార్గెట్ 165. ఫస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఓపెనర్ గోల్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 8 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు డౌన్. పాక్ బౌలర్లు జోరు మీదున్నారు. పిచ్ నుంచి అంతగా సపోర్ట్ లేదు. జట్టును ఓటమి వెంటాడుతోంది. అయినా, ఆ టీమ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్  (51 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100) పోరాటం ఆపలేదు. ప్రత్యర్థులు స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విసురుతున్నా.. సహచరులు పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యూ కడుతున్నా.. అస్సలు తగ్గలేదు. తీవ్ర ఒత్తిడిలో..  ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతుండగా  ఖతర్నాక్ షాట్లతో  విజృంభించాడు. పాక్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చీల్చిచెండాడుతూ 50 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే సెంచరీ కొట్టాడు. కెప్టెన్ అసమాన పోరాటంతో మంగళవారం జరిగిన టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–8 రౌండ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్ 2  వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. వరుసగా రెండు విజయాలతో అందరికంటే ముందుగా సెమీఫైనల్ చేరుకుంది.  పాక్ సెమీస్ దారిని దాదాపు మూసి వేసింది. ఈ పోరులో తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 164/9 స్కోరు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (45 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) ఫిఫ్టీతో సత్తా చాటాడు. లియామ్ డాసన్ (3/24) మూడు, జెమీ ఓవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/26), జోఫ్రా ఆర్చర్ (3/32) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్రూక్ సెంచరీతో ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 166/8 స్కోరు చేసి గెలిచింది. విల్ జాక్స్ (28) కూడా రాణించాడు. షాహీన్ ఆఫ్రిది (4/30) నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది.  

ఫర్హాన్ ఫిఫ్టీ

టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధాటిగా ఆడినా మరో ఓపెనర్ సైమ్ ఆయుబ్ (7) ఫెయిలయ్యాడు.  మూడో ఓవర్లో ఆర్చర్ షార్ట్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెథెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆపై లెఫ్టార్మ్ స్పిన్నర్ డాసన్ తన మూడో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కెప్టెన్ సల్మాన్ ఆఘా (5)ను పెవిలియన్ చేర్చడంతో పాక్27/2తో నిలిచింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫర్హాన్ కు తోడైన వెటరన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (25)  స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. దాంతో సగం ఓవర్లకు పాక్ 70/2 స్కోరు చేసింది.  అయితే, బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 46  రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఫఖర్ జమాన్  (16 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25) .. జాక్స్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊపు తెచ్చాడు. జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాతి ఓవర్లో జమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫర్హాన్ చెరో సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్కోరు వంద దాటించారు. ఈ క్రమంలో ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఓవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన 16వ ఓవర్లో 6, 4తో  ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత స్పీడు పెంచడంతో పాక్ మంచి స్కోరు చేసేలా కనిపించింది. కానీ  తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే  ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్బీ  చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 49 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది.  స్లాగ్ ఓవర్లలో ఇంగ్లిష్ బౌలర్లు వరుస వికెట్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. స్పిన్నర్ ఆదిల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జమాన్ సిక్స్ కొట్టి ఔటవగా.. అదే ఓవర్లో  ఉస్మాన్ ఖాన్ (8) భారీ సిక్స్ రాబట్టాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (11 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లతో 23) మెరుపులతో పాక్ స్కోరు 160 మార్కు దాటింది.

ఖతర్నాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

క్లిష్టమైన వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాక్ పేసర్ షాహీన్ తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు.  ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫిల్ సాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0)ను ఫస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఔట్ స్వింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పెవిలియన్ చేర్చాడు. రెండో ఓవర్లో 4, 6 కొట్టిన బ్రూక్ ధాటిగా ఆడగా..  బట్లర్ (2), బెథెల్ (8)ను పెవిలియన్ చేర్చిన షాహీన్ ఇంగ్లండ్‌‌ను 35/3తో నిలిపాడు. అయితే, స్పిన్నర్ నవాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 4, 4, 6తో వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం చెప్పిన బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్ ప్లేను 53/3తో ముగించాడు. పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ దెబ్బకు టామ్ బాంటమ్ (2) వెనుదిరగ్గా.. బ్రూక్ మాత్రం అస్సలు తగ్గలేదు.  28 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకొని  తర్వాత మరింత స్పీడు పెంచాడు. షాదాబ్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. అతనికి కాసేపు సపోర్ట్ ఇచ్చిన కరన్(16)ను తారిఖ్ ఔట్ చేయడంతో 103 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది. అయితే ఒంటరి పోరాటం చేస్తున్న  బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విల్ జాక్స్ (28)  మంచి సపోర్ట్ ఇచ్చాడు. తారిఖ్​ వేసిన 16వ ఓవర్లో జాక్స్ , బ్రూక్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ ఇంగ్లండ్ చేతుల్లోకి వచ్చేసింది. ఆపై షాహీన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  4, 6, 4తో సెంచరీ పూర్తి చేసుకున్న  బ్రూక్ తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే బౌల్డ్ అయ్యాడు. అప్పటికి 10 రన్స్ మాత్రమే అవసరం అయ్యాయి. 18వ ఓవర్లో  సల్మాన్ 5 రన్స్ ఇవ్వగా.. 19వ ఓవర్లో  జాక్స్,  ఓవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్ చేసిన నవాజ్ రెండే రన్స్ ఇవ్వడంతో కాస్త  టెన్షన్ రేగింది. కానీ, లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఫోర్ కొట్టిన ఆర్చర్ (5 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మ్యాచ్ ముగించాడు. 

సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 20 ఓవర్లలో 164/9 (సాహిబ్జాదా ఫర్హాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 63, ఫఖర్ జమాన్ 25, డాసన్ 3/24, ఓవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2/26). ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 19.1 ఓవర్లలో 166/8 (హ్యారీ బ్రూక్ 100, జాక్స్ 28, షాహీన్ 4/30)

  • ఈ టోర్నీ  చరిత్రలో సెంచరీ కొట్టిన తొలి కెప్టెన్‌‌గా హ్యారీ బ్రూక్‌‌ రికార్డుకెక్కాడు. బట్లర్‌‌‌‌, మలన్ తర్వాత మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఇంగ్లండ్ మూడో బ్యాటర్‌‌‌‌గా బ్రూక్ నిలిచాడు.
  • టీ20 వరల్డ్ కప్స్‌‌లో పాక్‌‌తో ఆడిన 4 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఇంగ్లండ్ గెలిచింది.
  •  ఈ టోర్నీలో ఇంగ్లండ్ సెమీస్ చేరడం వరుసగా ఇది ఐదోసారి. 2016 ఎడిషన్ నుంచి ప్రతీసారి సెమీస్ వరకు వచ్చింది. 
  • పాక్ ( 2007–12), లంక (2009–14) వరుసగా నాలుగు సార్లు సెమీస్ చేరాయి.