జైపూర్ ప్యాలెస్లో ఘనంగా ఆశిష్ రెడ్డి వివాహం.. హైలెట్గా నిలిచిన దిల్ రాజు

జైపూర్ ప్యాలెస్లో ఘనంగా ఆశిష్ రెడ్డి వివాహం.. హైలెట్గా నిలిచిన దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) తమ్ముడి కొడుకు, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి(Ashish Reddy), అద్వైత రెడ్డి(Advaitha Reddy)ల వివాహం ఘనంగా జరిగింది. జైపూర్ ప్యాలెస్ లో వైభవంగా జరిగిన ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఈ పెళ్లిలో దిల్ రాజు చేసిన డాన్స్ హైలెట్ గా నిలిచింది. డ్రమ్ వాయిస్తూ, డ్యాన్స్ వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక యంగ్ హీరో ఆశీష్ విషయానికి వస్తే ఆయన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు. ఇటీవల వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్ రెడ్డి. మ్యూజికల్ గా మంచి హిట్ ఐన ఈ సినిమా.. కమర్షియల్ గా మాత్రం పెద్దగా సక్సెస్ అవలేదు. ఇక రెండొవ సినిమాగా సెల్ఫిష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆశిష్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ : పోచర్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదల