అనుష్క చెప్పిందే ఫాలో అవుతున్నాను.. నటి ఆశ్రిత ఆసక్తికర కామెంట్స్

అనుష్క చెప్పిందే ఫాలో అవుతున్నాను.. నటి ఆశ్రిత ఆసక్తికర కామెంట్స్

బాహుబలి 2(Bahubali2) సినిమాలో అనుష్క(Anushka) వదినగా చేసిన యాక్టర్ గుర్తుందా. ఆమె పేరు ఆశ్రిత వేముగంటి(Ashritha Vemuganti). మనకి నటిగానే తెలుసు కానీ, అంతకన్నా  ముందే దేశవిదేశాల్లో ఎన్నో భారతనాట్య ప్రదర్శనలు ఇచ్చారు ఆశ్రిత. అలా చాలా మందికి ఆమె సుపరిచితమే. కానీ నటిగా మారిన తరువాత ఫేమ్ అయ్యారు. ఇక బాహుబలి తరువాత డియర్ కామ్రేడ్, యాత్ర, క్రాక్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 

మరీ ముఖ్యంగా క్రాక్ సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. కటారి కృష్ణ భార్యగా ఆమె నటన ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం టాలీవుడ్ నుండి వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఆశ్రిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె తన సినీ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. 

నా మొదటి సినిమా బాహుబలి. ఆ సినిమాలో నా పాత్రకి మంచి స్పందిన వచ్చింది. ఆ తరువాత కకూడా చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ, సెలెక్టెడ్ గానే సినిమాలు చేస్తున్నాను. కొన్ని సినిమాల్లో చెప్పిన కథకు ఫైనల్ గా వచ్చిన సినిమాకు అస్సలు సంబంధం ఉండదు. కానీ, క్రాక్ సినిమా విషయంలో మాత్రం నాకు ఎం చెప్పారో అదే చేయించారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇక బాహుబలి షూటింగ్ సమయంలో అనుష్క నాకు చాలా క్లోజ్ అయ్యారు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఎలా బ్యాలన్స్ చేయాలో ఆమె నాకు చెప్పారు. ఇప్పటికి ఆమె చెప్పినట్టుగానే ఫాలో అవుతున్నారు. అని చెప్పుకొచ్చారు ఆశ్రిత వేముగంటి.