50 థియేట‌ర్ల కోసం ఆలోచిస్తూ..1200 థియేట‌ర్ల‌ని వ‌దులుకోలేం క‌దా: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

50 థియేట‌ర్ల కోసం ఆలోచిస్తూ..1200 థియేట‌ర్ల‌ని వ‌దులుకోలేం క‌దా: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

శుక్రవారం వస్తేనే సినిమాల పండుగ వస్తోంది. అలాంటిది సంక్రాంతి లాంటి పండుగ వస్తే..ఇక సినిమాల జాతర ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అదే ఊహలో..పెద్ద హీరోలు..భారీ బడ్జెట్ సినిమాలు..హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్..ఇక అలాంటి జాతర లాంటి పండుగ ఊహించుకుంటేనే..నోరురెస్తోంది కదా..ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి జాతరే ఉంది. 

కానీ, టాలీవుడ్లో ప్రస్తుతం రిలీజ్ సినిమాలు ఎక్కువయ్యాయి. థియేటర్స్ తక్కువయ్యాయి.దీంతో కొన్ని సినిమాలపై ఆశలు పెట్టుకున్న ఆడియన్స్కి చేదు వార్త మిగులుతుంది. ఇప్పటికే, రవితేజ ఈగల్ మూవీ పొంగల్ నుండి ఔట్ అయిపోయింది.

ఇపుడు హనుమాన్ (Hanuman) సినిమాకు థియేట‌ర్ల కేటాయింపులో అన్యాయం జ‌రుగుతోంద‌ని చిత్ర నిర్మాత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ వస్తున్నారు. ఇదే విషయంపై..త‌మ సినిమాకి హిట్ టాక్ వస్తే కనుక..థియేట‌ర్ల సంఖ్య అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanthvarma) ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రీసెంట్గా ప్రశాంత్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంట్వ్యూలో మాట్లాడుతూ..'మా సినిమాపై హిందీ బ‌య్య‌ర్లు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. అక్క‌డ 1200 థియేట‌ర్ల‌లో హనుమాన్ ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. కానీ తెలుగులో మాకు కేవ‌లం 50 థియేట‌ర్లే దొరుకుతున్నాయి. దీంతో మాకు చాలా నష్టం వస్తోంది. కానీ, 50 థియేట‌ర్ల కోసం ఆలోచిస్తూ..1200 థియేట‌ర్ల‌ని వ‌దులుకోలేం క‌దా' అన్నారు. ఏదేమైనప్పటికీ హనుమాన్ సినిమా మేము అనుకున్నదానికంటే..పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం గ్యారంటీ అంటూ ప్రశాంత్ వర్మ కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు.

 ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్లు గురించి మాట్లాడుతూ..'ఇప్పటికే చాలా కథలతో ఉన్నాను.నాకు అనేక ప్రణాళికలు ఉన్నాయి. హను-మాన్‌ సినిమా రిలీజ్ తర్వాత వాటిపై నిర్ణ‌యం తీసుకుంటా. అంతేకాదు.. హ‌నుమాన్ మూవీకి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఒక సూపర్ ఉమెన్ స్టోరీ కూడా ఉంది. దానికి మంచి నిర్మాత కావాలి' అని అన్నారు.