అదృష్టం అంటే ఇలా ఉండాలి.. ఫస్ట్ టైం కొన్న లాటరీకి 12 కోట్లు వచ్చాయి

అదృష్టం అంటే ఇలా ఉండాలి.. ఫస్ట్ టైం కొన్న లాటరీకి 12 కోట్లు వచ్చాయి

ఒక్క లాటరీ టికెట్ అతని జీవితాన్నే మార్చేసింది. ఫస్ట్ టికెట్ కొన్నాడు.. అదీ ఒకేఒక్కటి.. అతడి అదృష్టం పండింది. యూఏఈ లాటరీలో తొలిటికెట్ తోనే జాక్ పాట్ తగిలింది. కోటీశ్వరుడయ్యాడు. అతనికున్న దరిద్రం మొత్తం పోయింది. తమిళనాడుకు చెందిన మురుగన్ నాథ్ కు దుబాయ్ లోని ఓ  లాటరీలో రూ.7కోట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఒక సాధారణ నిర్ణయం అసాధారణ అధ్యాయంగా మార్చింది. ప్రతి విజయంలో ఒక కథ ఉంటుంది.. అలాగే మురగనాథ్ విజయంలోనూ ఓ కథ ఉంది అదేంటో చూద్దాం. 

తమిళనాడుకు చెందిన 42 ఏళ్ల మురుగనాథ్ గోవిందన్ .. ఇటీవల దుబాయ్ కి వెళ్లాడు. సరదా ఓ లాటరీ టికెట్ కొనాలనుకున్నాడు. దుబాయ్ లో గేమ్ ఎల్ ఎల్ సీ లైఫ్ చేంజింగ్ మూవ్ మెంట్ పేరుతో నిర్వహిస్తున్న UAE లాటరీ  టికెట్ కొన్నాడు. అది  అతని జీవితాన్నే మార్చేసింది. మురగనాథ్ ఒక్కసారిగా కోటీశ్వరుడై పోయాడు. అక్షరాల 5మిలియన్ దిన్హార్లు  అంటే రూ.12కోట్లు గెలుచుకున్నాడు. ఉన్నట్టుండి  కోటీశ్వరుడు కావడంతో అతని సంతోషానికి అవధుల్లేవ్.

ఫిబ్రవరి 14న జరిగిన లక్కీ డ్రాలో 260214 నంబర్ తో రెండో బహుమతిగా రూ.12కోట్లు  గెలుచుకున్నారు మురగనాథ్. డేస్ విభాగంలోని ఆరు సంఖ్యలు - 11, 19, 28, 15, 31 ,7 - లతో సరిపోలడంతో అతను 5 మిలియన్ల దిర్హామ్‌లను బహుమతిని పొందాడు. 

గేమ్ ఎల్ ఎల్ సీ లైఫ్ చేంజింగ మూవ్ మెంట్ వీడియోలు చూసిన మురగనాథ్.. లాటరీలో పాల్గొనాలని డిసైడ్ అయ్యాడు. తన ఐడీతో లాటరీ వెబ్ సైట్ లో లాగిన్ అయి ఓ టికెట్ కొన్నాడు. కొనేముందు టికెట్ నంబర్ సెలక్ట్ చేసుకోవడంలో  స్ట్రాటజీని ఉపయోగించాడు.  తన యంగేజ్ మెంట్ డే నవంబర్ 11, అతని బిడ్డ బర్త్ డే సంవత్సరం 2015నుంచి అంకెలను సెలక్ట్ చేసుకొని వాటిని యాడింగ్ చేయడం ద్వారా లాటరీ టికెట్ ఎంచుకున్నాడు. లాటరీ టికెట్ కొనడంలో అతని ఫ్రెండ్ సాయం కూడా తీసుకున్నాడు.  ఎట్టకేలకు మురుగనాథ్ ను అదృష్టం వరించింది. 

లాటరీ గెలిచిన తర్వాత మురగనాథ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.మూడేళ్లుగా ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని, సవాళ్లను గుర్తు చేసుకున్నారు. వివాహం, పిల్లల చదువు, కుటుంబబాధ్యతలతో కష్టపడి ఎంతో కొంత సంపాదించాలని దుబాయ్ వెళ్లాడు మురగనాథ్. అయితే ఇంత త్వరగా తన కష్టాలు తీరుతాయని ఊహించలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురయ్యాడు. 

కష్టపడే వారు ఎప్పుడు నష్టపోరు.. అనే నమ్మకంతో దుబాయ్ వెళ్లి కష్టపడాలని నిర్ణయించుకున్నాను.. ఎంతో శ్రమకోర్చిదుబాయ్ లో ఉద్యోగం సంపాదించాను. మరో నాలుగైదేళ్లలో నా కష్టానికి ఫలితం దక్కుతుందని నమ్మాను.. అయితే  ఇంత త్వరగా నా కష్టం తీరుతుందని నేను ఊహించలేదు. లక్కీ డ్రా నాజీవితాన్ని మర్చేసిందని మురగనాథ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.