మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా పెద్దింటి పద్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చైర్ పర్సన్ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు .
అనంతరం మాట్లాడిన మంత్రి వివేక్.. ‘చెన్నూరు మున్సిపాలిటీనీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులను గెలిపించుకున్నందుకు చెన్నూరు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కౌన్సిలర్ లు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు వినాలి. ముఖ్యమైన సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించాలి. మున్సిపాలిటీలో అన్ని వార్డులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుమారు 50 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా వార్డులలో బోర్ వెల్స్ సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ పనులు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమృత్ 2.0 పనులతో ఇంటింటికి నీళ్లు అందజేస్తాం. మిషన్ భగీరథ పథకం పేరుతో వేల కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారు’.
‘చెన్నూరు పట్టణ ప్రజలకు గోదావరి నుంచి మంచి నీటి పథకం పనులు చేసుకుంటాం. త్వరలోనే పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేసుకోబోతున్నాం. పట్టణంలో కుల సంఘాల భవనాల కోసం వారికి ఇప్పటికే నిధులు కేటాయించాం. మనకు గోదావరి ఇసుక కావాలని కోరుతున్నారు . ఇంకో 6 నెలల్లో ఇక్కడి ప్రాంత ప్రజలకు గోదావరి ఇసుకను అందిస్తాం. మారెమ్మ వాడలో ఆటోలు వెళ్లే పరిస్థితి లేకుండే నేను గెలిచాక రోడ్లు వేశాం. మున్సిపాలిటీలో 100 కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యలపైన క్యాబినెట్ లో చర్చలు జరిపాం. మెదక్ లో నాకు ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు అక్కడ కాంగ్రెస్ పార్టీనే బలోపేతం చేశాను. చెన్నూరు మున్సిపాలిటీకీ ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసుకుందాం . కాంట్రాక్టర్ల పాత నిధులు మంజూరు చేయలేదు గత ప్రభుత్వం. దేవుల వాడ బబ్బేరు చెలుక గ్రామాల రైతుల భూములకు పరిహారం ఇప్పించడం జరిగింది. సుమారు 18 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి పంపిణీ చేయడం జరిగింది . మే నెలలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తాం. చెన్నూరు లో ప్రతీ వార్డును కలిసి కట్టుగా పని చేసి మున్సిపాలిటీనీ అభివృద్ధి చేసుకుందాం. కోటి ఇరవై లక్షల రూపాయితో శ్మశాన వాటిక పనులు జరుగుతున్నాయి’ అని మంత్రి వివేక్ తెలిపారు.
