ములుగు, వెలుగు: పదో తరగతి పరీక్షలకు అభ్యర్థికి బదులుగా మరో వ్యక్తి హాజరైన కేసులో నిందితుడికి ములుగు జడ్జి మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మీడియాకు వెల్లడించారు. 2017లో ములుగులోని టెన్త్ ఎగ్జామ్ సెంటర్కు జగన్నాథం సాంబయ్యకు బదులుగా అతడి అన్న కొడుకు నాగార్జున పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఇన్విజిలేటర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి జ్యోత్స్న తీర్పు చెప్పారు.
