హైదరాబాద్: జులై 23 నుంచి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్

హైదరాబాద్: జులై 23 నుంచి ఎఫెక్టివ్ పబ్లిక్  స్పీకింగ్ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ గోల్కొండ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న పార్థాని టవర్స్‌‌‌‌‌‌‌‌లో మీడియా జంక్షన్ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 26 వరకు ప్రత్యేకంగా ‘ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్’ జరగనున్నది.  ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే ఈ శిక్షణకు ప్రముఖ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్ పర్ట్ డి.రామచంద్రం నేతృత్వం వహిస్తారు. 

రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు సహా తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఈ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్ ఉపయోగపడుతుందని రాంచంద్రం తెలిపారు. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌లో బాడీ లాంగ్వేజ్, ప్రసంగాలు, కంటెంట్ తయారీ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారన్నారు. వివరాలకు 98488 42471 / 98480 42020 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.