హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని, తద్వారా కేంద్ర నిధులు విడుదల కావడానికి మార్గం సుగమం అవుతుందని సీఎస్ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా గ్రూప్ కో ఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించి ఆర్థిక వనరుల సమీకరణ, శాఖల సమన్వయం, కేంద్ర, రాష్ట్ర సమన్వయంతో అమలు చేస్తున్న పథకాలు, నిధుల సమీకరణ పెంపొందించే చర్యలు తదితర అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమీక్షలో శాఖల వారీగా పథకాల పురోగతిని సీఎం డ్యాష్ బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు.
