టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న (Virosh) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా వీరి ప్రేమాయణంపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట ఏడడుగులు వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ జోడీ పెళ్లి ఫోటోలే కనిపిస్తున్నాయి.
వైభవంగా వివాహం..
ఉదయ్‌పూర్‌లోని అత్యంత విలాసవంతమైన మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ ఈ వేడుకకు వేదికైంది. ఫిబ్రవరి 26 ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు విజయ్ . ఈ వివాహం ఇరువురి సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ఉదయం అత్యంత వైభవంగా తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. సాయంత్రం రష్మిక పుట్టినూరైన కొడగు (కర్ణాటక) సంప్రదాయం ప్రకారం 'కొడవ' పద్ధతిలో వేడుకలు నిర్వహించారు. దండలు మార్చుకునే సమయంలో విజయ్, రష్మిక ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు. వారి కళ్ళలో కనిపించిన ఆనందబాష్పాలు చూసి అక్కడ ఉన్న అతిథులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. 'గీత గోవిందం' సినిమాతో మొదలైన వీరి స్నేహం, 'డియర్ కామ్రేడ్'తో బలపడి, నేడు నిజ జీవితంలో దంపతులుగా మారారు.
Hi my loves,
— Rashmika Mandanna (@iamRashmika) February 26, 2026
Introducing to you now “My Husband”! 💘
Mr. Vijay Deverakonda!! ❤️
The man who taught me what true love feels like,
The man who showed me what being in peace feels like! 🤍
The man who told me everyday that dreaming big was absolutely ok and constantly telling… pic.twitter.com/MPrsGfNTwb
ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీ..
ఈ నూతన దంపతులు విజయ్ రష్మిక తమ వివాహం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను స్వయంగా కలిశారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న వివాహ రిసెప్షన్‌కు వారిని ఆహ్వానించారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ జంటకు ప్రత్యేకంగా ఒక లేఖను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కొత్తదంపతులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా "హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విరోష్" అంటూ విషెస్ తెలియజేస్తున్నారు.
#VijayDeverakonda #RashmikaMandanna #Modiji #Virosh pic.twitter.com/jbZValDLyi
— saikirankotha (@saikirankotha9) February 26, 2026
మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్
పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో బంధువులు, అంత్యంత సన్నిహితుల మధ్య జరగింది. చిత్ర పరిశ్రమలోని మిత్రులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల కోసం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ లోకమంతా తరలివచ్చే అవకాశం ఉంది. రాజస్థానీ రాయల్టీ, సౌత్ ఇండియన్ ట్రెడిషన్ల కలయికతో జరిగిన ఈ వివాహం 2026లోనే అత్యంత భారీ వేడుకగా నిలిచిపోయింది. రీల్ లైఫ్ కెమిస్ట్రీని రియల్ లైఫ్‌లోకి మార్చుకున్న ఈ జంట కలకాలం వర్ధిల్లాలని అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
