టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఖచంద్ర సింగ్ నోయిడాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 27న ఇవాళ మృతి చెందాడు.
ప్రస్తుతం టీ20వరల్డ్ కప్ లో ఉన్న రింకూ సింగ్ తండ్రి మరణవార్త విని హుటాహుటిన ఉత్తరప్రదేశ్ లోని అలీఘాట్ కు బయల్దేరాడు. రింకూ సింగ్ చాలా పేదరికం నుంచి వచ్చి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. రింకూ సింగ్ తండ్రి ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే పని చేస్తూ ఎన్నో కష్టాల మధ్య రింకూను క్రికెటర్ గా తీర్చిదిద్దారు. తన ఎదుగుదలలో తండ్రి పాత్ర ఎంతో ఉందని రింకూ చాలా సందర్భాల్లో చెప్పాడు.
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా రింకూ సింగ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
