ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిర్మాణం ఏ దిక్కునుంచి ప్రారంభించాలి.. ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే నష్టాలొస్తాయా..మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న: ఇల్లు కట్టుకునేముందు వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:కొత్త ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనుకుంటే వాస్తు దోషాలు లేని స్థలంలోనే కట్టుకోవాలి. నేల కూడా బాగుండాలి. చుట్టు పక్కల ఉన్న ఇళ్లు, నిర్మాణాలు వంటివి కూడా చూసుకోవాలి. ఏవైనా దోషాలున్నాయి అనిపిస్తే నివారణ చర్యలు తీసుకుని, పరిహారం చేసుకుంటే బెటర్.
ప్రశ్న: ఏ ఆటంకం లేకుండా ఇల్లు కట్టాలంటే ఎటువైపు నుంచి కట్టడం మొదలుపెట్టాలి?.
జవాబు: పడమర లేదా దక్షిణం వైపు నుంచి నిర్మాణం ప్రారంభిస్తే మంచిది. అయితే నిర్మాణం చేపట్టే స్థలానికి కూడా ఎటువంటి వాస్తు దోషాలు ఉండకూడదు.
