- హనుమకొండలో చాహత్ బాజ్‍పాయ్, కర్నాటి వరుణ్‍రెడ్డి
- మహబూబాబాద్‍లో స్నేహా శబరీశ్, డాక్టర్ శబరీశ్
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో గురువారం ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు జరిగిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లోని రెండు జిల్లాల్లో పెద్దాఫీసర్లుగా రెండు జంటలకు ఒకే చోట పని చేసే అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‍గా వ్యవహరిస్తున్న చాహత్ బాజ్‍పాయ్ గురువారం హనుమకొండ కలెక్టర్‍గా మరోసారి బాధ్యతలు తీసుకున్నారు.
కాగా, ఆమె భర్త ఐఏఎస్ ఆఫీసర్ కర్నాటి వరుణ్‍రెడ్డి హనుమకొండ కేంద్రంగా ఉండే విద్యుత్ భవన్ నుంచే టీజీఎన్‍పీడీసీఎల్ సీఎండీగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు హనుమకొండ కలెక్టర్‍గా ఉన్న స్నేహా శబరీశ్ మహబూబాబాద్ కలెక్టర్‍గా ట్రాన్స్ఫర్ అయ్యారు. కాగా, ఇదే జిల్లా ఎస్పీగా కలెక్టర్ భర్త డాక్టర్ శబరీశ్ ఇప్పటికే పని చేస్తున్నారు.
