IND vs WI: క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహా సమరానికి రంగం సిద్ధమైంది. కేరళలోని తిరువనంతపురం వేదికగా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇవాళ (సెప్టెంబర్, ఆదివారం) తొలి పోరు అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. ఈ ఫైట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ ఇండియా జెర్సీలో మైదానంలోకి ఎంట్రీ ఇస్తుండగా.. నమన్ ధీర్ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు.
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. పిచ్ మొదటి ఇన్నింగ్స్‌లో డీసెంట్‌గా కనిపిస్తున్నప్పటికీ, లైటింగ్ కింద (రెండో ఇన్నింగ్స్‌లో) పరిస్థితులు మరింత మెరుగ్గా మారుతాయని, అందుకే చేజింగ్ చేయడమే సరైన వ్యూహమని గిల్ స్పష్టం చేశారు.
వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు సుమారు 20 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి, మెగా టోర్నీలో మేము ఉండాలంటే.. ఖచ్చితంగా ఈ సిరీస్ గెలవాల్సిందే.. అందుకే మాకు భారత్ పై గెలవడం చాలా ముఖ్యం అన్నాడు. విండీస్ జట్టు నలుగురు బౌలర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లతో కూడిన పటిష్టమైన కాంబినేషన్‌తో బరిలోకి దిగుతోందని పేర్కొన్నాడు.
ఇరు జట్లు:
వెస్టిండీస్: జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్తీ, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), అమీర్ జాంగూ, జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్, నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
