నాని నటించిన ‘ది పారడైజ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మొదటి రోజే భారీ ఓపెనింగ్ అందుకున్న ఈ సినిమా.. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వీకెండ్‌లో కలెక్షన్స్ మరింత పెరుగుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
డే వైజ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్
‘ది పారడైజ్’ మూడు రోజుల్లో సాధించిన వరల్డ్‌వైడ్ గ్రాస్‌ను గమనిస్తే..
డే 1: రూ.88 కోట్లు
డే 2: రూ.114 కోట్లు
డే 3: రూ.136 కోట్లు+
It is JADAL ZAMANA at the box office 🔥🔥#TheParadise collects 136 CRORES+ GROSS WORLDWIDE in 3 days ❤🔥❤🔥
— THE PARADISE (@TheParadiseOffl) September 27, 2026
Book your tickets now!
🎟️ https://t.co/QWwS4Ichic pic.twitter.com/PCKO7J85gD
దీంతో నాని కెరీర్‌లో అత్యంత వేగంగా రూ.100 కోట్ల వరల్డ్‌వైడ్ మార్క్ దాటిన సినిమాగా ‘ది పారడైజ్’ నిలిచిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ వీకెండ్ అవ్వడంతో రూ.150 కోట్ల మైలురాయిని క్రాస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇండియా నెట్ కలెక్షన్స్:
ట్రాకర్ గణాంకాల ప్రకారం.. ‘ది పారడైజ్’ ఇండియా నెట్ కలెక్షన్స్ మూడు రోజుల్లో రూ.76.40 కోట్లకు చేరుకున్నాయి. నాలుగో రోజు లైవ్ ట్రాకింగ్ కలుపుకుంటే ఈ మొత్తం సుమారు రూ.79.68 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. డే వైజ్‌గా చూస్తే.. సెప్టెంబర్ 23న పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.11.60 కోట్లు రాగా, సెప్టెంబర్ 24న రిలీజ్ డే సందర్భంగా రూ.34.65 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. రెండో రోజు రూ.14.90 కోట్లు, మూడో రోజు రూ.15.25 కోట్లు రాబట్టింది.
ప్రీమియర్స్ డే – రూ.11.60 కోట్లు
డే 1 – రూ.34.65 కోట్లు
డే 2 – రూ.14.90 కోట్లు
డే 3 – రూ.15.25 కోట్లు
డే 4 (ఆదివారం) – రూ.3.28 కోట్లు (లైవ్ ట్రాకింగ్)
మొత్తం – సుమారు రూ.79.68 కోట్లు
మూడో రోజు కూడా కలెక్షన్స్ పెద్దగా తగ్గకపోవడం విశేషం. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు వసూళ్లు స్వల్పంగా పెరిగినట్లు ట్రాకర్ గణాంకాలు సూచిస్తున్నాయి.
తెలుగు మార్కెట్‌దే హవా..
భాషల వారీగా చూస్తే ‘ది పారడైజ్’కు తెలుగు వెర్షన్ లోనే ఎక్కువ వసూళ్లు సాధిస్తోంది. మూడో రోజు తెలుగు వెర్షన్ రూ.13.35 కోట్ల నెట్ వసూలు చేయగా, హిందీ వెర్షన్ రూ.1.65 కోట్లు, తమిళ వెర్షన్ రూ.25 లక్షలు రాబట్టినట్లు ట్రాకర్ లెక్కలు వెల్లడించాయి.
ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు
ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ‘ది పారడైజ్’ మంచి వసూళ్లను రాబడుతోంది. మూడో రోజు ఒక్కరోజే ఈ సినిమాకు సుమారు రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మూడు రోజుల్లో ఓవర్సీస్‌లో మొత్తం రూ.29 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రాకర్ గణాంకాలు సూచిస్తున్నాయి. మరోవైపు.. తొలి రోజుతో పోలిస్తే కలెక్షన్స్‌లో కొంత హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, వీకెండ్‌లో సినిమా వసూళ్లు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ‘ది పారడైజ్’ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నాని పాల్గొని సినిమాకు వస్తున్న స్పందన, ప్రేక్షకుల ఆదరణపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
రూ.150 కోట్ల మార్క్‌పై కన్ను..
మూడు రోజుల్లోనే రూ.136 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ‘ది పారడైజ్’.. ఇప్పుడు రూ.150 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత నంబర్ల ప్రకారం ఆ మార్క్‌ను అందుకోవడానికి మరో రూ.14 కోట్లకు పైగా గ్రాస్ అవసరం ఉంది. వీకెండ్‌లో, ముఖ్యంగా ఆదివారం కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
మొత్తంగా.. మిక్స్‌డ్ టాక్‌ను దాటుకుంటూ ‘ది పారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్‌కు తగ్గట్టుగా భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఎంత గ్రాస్ సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
