ఎంపీ తేజస్వి సూర్య భార్యకు రైల్లో చేదు అనుభవం.. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్..

ఎంపీ తేజస్వి సూర్య భార్యకు రైల్లో చేదు అనుభవం.. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్..

బెంగుళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ స్కందప్రసాద్ కు రైల్లో తోటి ప్రయాణికుల వల్ల చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో ఆమె ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది.రైలు ప్రయాణంలో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను ట్వీట్ లో వెల్లడించారు.

తాను ప్రయాణించిన రైల్లో 56 సీట్లు ఉండగా.. అందులో 40 మంది ప్రయాణికులు ఒకే బ్యాచ్ కి చెందినవారని.. సుమారు ఐదు గంటల పాటు సాగిన జర్నీలో నాన్ స్టాప్ గా శబ్దాలు చేస్తూ గట్టిగా మాట్లాడుకుంటూ అరుస్తూ గడిపారని.. యూనో గేమ్ ఆడుతూ..పెద్దగా నవ్వుతూ గోల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు శివశ్రీ స్కందప్రసాద్.

ఈ విషయంపై టీటీకి కంప్లైంట్ చేస్తే... ఆయన వరించినప్పటికీ ఆ బ్యాచ్ వినలేదని చెప్పుకొచ్చారు. ఎందుకు గోల చేస్తున్నారని టీటీ ప్రశ్నించగా... నవ్వుతూ.. మీరు కూడా వచ్చి ఆడండి అంటూ బాధ్యతారహితంగా ప్రవర్తించారని అన్నారు. వాళ్ళ వల్ల కోచ్ లో తోటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారని.. అయినా మౌనంగా భరించాల్సి వచ్చిందని అన్నారు శివశ్రీ.