ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) పరిధిలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు, పార్ట్ టైమ్ టీచర్ (ఇంగ్లిష్) పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: టీచింగ్ అసోసియేట్.
విభాగాల వారీగా ఖాళీలు: బయోకెమిస్ట్రీ అండ్ క్రాప్ ఫిజియాలజీ 01, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ 01.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి క్రాప్ ఫిజియాలజీలో ఎంఎస్సీ (అగ్రికల్చర్), సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: అక్టోబర్ 1.
వాక్ఇన్ ఇంటర్వ్యూలు
పోస్టు పేరు: పార్ట్ టైమ్ టీచర్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఇంగ్లిష్), ఇంగ్లిష్‌లో పీహెచ్‌డీతోపాటు నెట్ లేదా సెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. యూజీ స్థాయిలో రెండేళ్ల బోధనా అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: అక్టోబర్ 3.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ pjtau.edu.inను సందర్శించండి.
